- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి బాలిక మృతి.. కారణం ఏంటంటే?
పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కరకగూడెం మండలం పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, కరకగూడెం: పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కరకగూడెం మండలం పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకగూడెం మండలం కలవలనగరం గ్రామానికి చెందిన కలం.అక్షర (18) భద్రాచలంలో ఇంటర్మీడియట్ చదువుతుంది. గత కొన్ని రోజుల ముందు ఇంటికి వచ్చిన అక్షరను తన తల్లిదండ్రులు కాలేజీ కి వెళ్ళావా అని మందలించడంతో మనస్తాపానికి గురై 15 రోజుల క్రితం పురుగుల మందు త్రాగడంతో తల్లిదండ్రులు చూసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Next Story






