- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెలివరీ అయిన భార్య.. సమయానికి వంట చేయకపోవడంతో భర్త ఏం చేశాడంటే..
by Sathputhe Rajesh |
ఇటీవల డెలివరీ అయిన భార్య వంట చేయడం లేదని హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల డెలివరీ అయిన భార్య వంట చేయడం లేదని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. డీసీపీ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల భజరంగీ గుప్తాకు భార్య ప్రీతి (22) ఉంది. వీరికి మూడేళ్ల క్రితం పెళ్లియింది. మూడు నెలల క్రితం వీరికి సంతానం కలిగింది. అయితే మృతురాలు రక్తహీనతతో బాధ పడుతుందని పోలీసులు తెలిపారు. కేవలం 40-45 కేజీల బరువు ఉందన్నారు.డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ రెడీగా ఉండకపోవడంతో కోపంతో తన భార్యను గుప్తా కర్రతో బలంగా కొట్టాడు. అయితే గాయాలపాలైన ప్రీతిని బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






