- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. ముగ్గురు మృతి
పెళ్లి బృందంతో వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని జాన్‌పూర్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి బృందంతో వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని జాన్‌పూర్ లో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న పెళ్లి వారి కారుకి ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో తీరని విషాదం ఎదురైంది. కేరాకట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపుతప్పి రోడ్డు దిగువనకు బోల్తా కొట్టినట్లు ఎస్పీ కౌస్తుభ్ వెల్లడించారు. "వారణాసి నుంచి పెళ్లి ఊరేగింపు జాన్‌పూర్‌కు వచ్చింది. ఊరేగింపులో పాల్గొన్న కొందరు సభ్యులు తిరిగి వెళ్తుండగా, వారి వాహనం (కారు) అదుపుతప్పి, ఎత్తు నుంచి కింద పడింది. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. గాయపడిన మిగిలిన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఇందుకోసం డాక్టర్లు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు," అని ఎస్పీ తెలిపారు. ఈ విషాద ఘటనతో పెళ్లి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకున్నాయి.






