మనం హాలిడేకు రాలేదు.. దేశ సేవకు వచ్చాం: టీమిండియా హెడ్ కోచ్ గంభీర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-11 09:02:50  IST  )

ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో కోల్పోయి, డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) రేసు నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే.

మనం హాలిడేకు రాలేదు.. దేశ సేవకు వచ్చాం: టీమిండియా హెడ్ కోచ్ గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో కోల్పోయి, డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) రేసు నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ (BCCI) నిబంధనలు కఠినతరం చేసింది. జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎక్కవ సమయాన్ని కుటుంబానికి కాకుండా ఆటకే కేటాయించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, తాజాగా భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ (England)లో పర్యటిస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంగ్లాండ్‌లో ఉన్న అతడు హుటాహుటిన భారత్‌కు చేరుకున్నాడు. అనంతరం తల్లి కుదుటపడ్డాక తిరిగి ఇంగ్లాండ్‌కు జట్టుతో చేరాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ నిబంధనలపై హెడ్ చోచ్ గంభీర్ చతేశ్వర్ పుజారాతో మాట్లాడుతూ.. ఆటగాళ్లకు కుటుంబం ముఖ్యమేనని అన్నాడు. కానీ, అదే సమయంలో దేశ సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కామెంట్ చేశాడు. హాలీడే కోసం విదేశాలకు రాలేదని.. దేశం కోసం ఆడేందుకు వచ్చామని తెలిపాడు. మన గురించి తక్కువగా ఆలోచించి జట్టుకు కోసం ఏం చేస్తే బాగుంటుందని ప్రతి ప్లేయర్ ఆలోచించాలని తెలిపాడు.

Next Story