- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన వాటర్ హీటర్.. గృహిణి మృతి
ఎలక్ట్రిక్ హీటర్ ప్రాణం తీసిన విషాద ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని , మల్లికార్జున నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

దిశ,మేడిపల్లి: ఎలక్ట్రిక్ హీటర్ ప్రాణం తీసిన విషాద ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని , మల్లికార్జున నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురైన ఓ గృహిణి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి హనుమాన్‌వాడకు చెందిన దుడ్డికారి స్వాతి (40) భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర నిలయం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ చర్లపల్లిలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో అద్దెకు ఉన్న వీరు, ఏడాది క్రితం అదే అపార్ట్‌మెంట్‌లో ఓ పోర్షన్ కొనుగోలు చేసి సొంతింట్లోకి మారారు. సోమవారం ఉదయం వేడి నీటి కోసం బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్ వేసిన సమయంలో స్వాతి ప్రమాదవశాత్తు జారి పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె చేయి హీటర్ ఉన్న నీటిలో తాకడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విద్యుత్ ప్రభావంతో శరీరంలోని కొంత భాగం కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా స్వాతి కాలిన స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.స్వాతి మృతితో ఆమె భర్త, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






