- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురిపట్ల మృగంలా ప్రవర్తించిన తండ్రి.. వైజాగ్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఆడపిల్లల్ని కంటిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే వారి పాలిట మృగాళ్లలా మారుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లల్ని కంటిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే వారి పాలిట మృగాళ్లలా మారుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి.. వారి జీవితాలను చిదిమేస్తున్నారు. ఐదేళ్ల కూతురిపట్ల మృగంలా ప్రవర్తించిన తండ్రి కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరణించేంత వరకూ జైల్లోనే ఉండాలని తెలిపింది. ఈ తరహా శిక్ష విధించడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు న్యాయ నిపుణులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి.. భార్య, ఇద్దరు పిల్లలతో విశాఖపట్నంలోని జాలారిపేటలో ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న భార్యతో గొడవపడి పిల్లల్ని తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి.. ఫుల్లుగా మద్యం తాగిన అతను.. పిల్లలిద్దరినీ తగరపువలసలో ఉన్న ఒక పాత సినిమా హాల్ వద్ద ఉన్న రేకుల షెడ్డులో నిద్రపుచ్చాడు. అర్థరాత్రి సమయంలో ఐదేళ్ల కూతురు లేచి ఏడుస్తుండటంతో.. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
పాప గట్టిగా ఏడవడంతో ఏమైందోనని సమీపంలో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ చూసి.. సెక్యూరిటీ గార్డుకు ఘటనపై సమాచారమిచ్చారు. అతను పోలీసులకు సమాచారమివ్వగా.. భీమిలి పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న పాపను కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో అన్ని ఆధారాలను సేకరించి.. కోర్టుకు అందించారు. అన్నీ పరిశీలించిన న్యాయస్థానం.. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందించాలని పేర్కొంది. నిందితుడు మరణించేంతవరకూ జైల్లోనే ఉండాలని శిక్షించింది.






