- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: కోర్టు ఆవరణలో సిబ్బందిపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు
బోధన్ కోర్టు ఆవరణలో వాహనం పక్కకు తీయమన్నందుకు ఓ వ్యక్తి సిబ్బందిపైనే దాడికి ఒడిగట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan) కోర్టు ఆవరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి ఏకంగా కోర్టు సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. వాహనం పక్కకు తీయమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయి, విధుల్లో ఉన్న ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అయితే ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సర్దార్ సింగ్ (Sardar Singh) అనే వ్యక్తి బోధన్ కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో తన వాహనాన్ని అడ్డంగా పార్క్ చేయడంతో, కోర్టు సిబ్బంది నరేందర్ (Narender) స్పందించి వాహనాన్ని పక్కకు తీయాల్సిందిగా కోరారు. దీంతో చిన్న విషయానికే సర్దార్ సింగ్ కోపంతో ఊగిపోయాడు. సిబ్బంది అని కూడా చూడకుండా నరేందర్‌తో వాగ్వాదానికి దిగి, అందరూ చూస్తుండగానే అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.
దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్..
ఈ దాడికి సంబంధించిన పూర్తి దృశ్యాలు కోర్టు ఆవరణలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుడు సిబ్బందిని తోసివేస్తూ, కొడుతున్న విజువల్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై కోర్టు ఆవరణలోనే దాడి జరగడంపై తోటి సిబ్బంది, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత సిబ్బంది నరేందర్ ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు నిందితుడు సర్దార్ సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






