రామ్ చరణ్‌పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

by Gantepaka Srikanth |

హన్మకొండ జిల్లా గోపాలపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రామ్ చరణ్‌పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా గోపాలపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిల్లర గొడవ కాస్తా ముదిరి, ఒక స్నేహితుడు మరో స్నేహితుడిపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. గోపాలపురానికి చెందిన రామ్ చరణ్, కార్తీక్ గత కొంతకాలంగా స్నేహితులు. వీరిద్దరి మధ్య రూ. 3 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన కార్తీక్, తన వద్ద ఉన్న కత్తితో రామ్ చరణ్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రామ్ చరణ్‌కు శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న రామ్ చరణ్‌ను గమనించిన స్థానికులు, వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసుల ఎంట్రీ...

ఘటన జరిగిన వెంటనే నిందితుడు కార్తీక్ అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story