మానవత్వం మంట కలిసిన వేళ.. తక్కువ కులం అని శవాన్ని పూడ్చిపెట్టనివ్వని గ్రామస్థులు!

by Ajay Maddhiboyina |

ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెడ‌న‌లో త‌క్కువ కులానికి చెందిన‌వాడ‌ని గ్రామ‌స్తులు గ్రామంలో అంత్య‌క్రియ‌ల‌నే నిర్వ‌హించ‌నివ్వ‌లేదు. గ్రామంలో 7 స్మ‌శాన‌వాటిక‌లు ఉన్నా శవం పూడ్చి పెట్ట‌డానికి క‌నీసం ఆర‌డుగుల జాగ‌ను కూడా ఇవ్వ‌లేదు.

మానవత్వం మంట కలిసిన వేళ.. తక్కువ కులం అని శవాన్ని పూడ్చిపెట్టనివ్వని గ్రామస్థులు!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెడ‌న‌లో త‌క్కువ కులానికి చెందిన‌వాడ‌ని గ్రామ‌స్తులు గ్రామంలో అంత్య‌క్రియ‌ల‌నే నిర్వ‌హించ‌నివ్వ‌లేదు. గ్రామంలో 7 స్మ‌శాన‌వాటిక‌లు ఉన్నా శవం పూడ్చి పెట్ట‌డానికి క‌నీసం ఆర‌డుగుల జాగ‌ను కూడా ఇవ్వ‌లేదు. దీంతో అధికారులు వ‌చ్చి గ్రామ‌స్థుల‌తో మాట్లాడారు. స్మ‌శాన‌వాటిక‌లో స్థ‌లాన్ని ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

ఈ క్ర‌మంలో రెండు రోజుల పాటు శవం ద‌గ్గ‌రే కుటుంబ స‌భ్యులు జాగారం చేస్తూ క‌న్నీరుమున్నీర‌య్యారు. శ‌వం పూడ్చిపెట్ట‌డానికి స్థ‌లం ఇవ్వాల‌ని వేడుకున్నారు. అయినా గ్రామ‌స్థులు క‌నిక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో ఓ రైతు త‌న పొలంలో అంత్య‌క్రియ‌లు చేసుకుకోవాల‌ని అనుమ‌తివ్వ‌డంతో కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కుటుంబ స‌భ్యులు మృత‌దేహం వ‌ద్ద రోదిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో గ్రామ‌స్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story