మంత్రాల నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-07 07:22:13  IST  )

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచం ఓ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో పరుగులు పెడుతోంది.

మంత్రాల నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచం ఓ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో పరుగులు పెడుతోంది. కానీ ఇదే సమయంలో, మన దేశంలో పలు ప్రాంతాల్లో ఇంకా మంత్రాలు, దయ్యాలు, శాపాలు వంటి మూఢ నమ్మకాలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ అపోహలు, అంధవిశ్వాసాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం వెనుకబాటుతనాన్ని సూచించే విషయం మాత్రమే కాకుండా, కొన్నిసార్లు అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తోంది. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే భద్రాద్రి కొత్తగూడెం (Badradri Kothagudem) జిల్లాలో చోటుచేసుకుంది.

ఆళ్లపల్లి మండలం భూసరాయి గ్రామంలో గుత్తికోయల కుటుంబాలు అధికంగా నివాసం ఉంటాయి. అయితే, మంగళవారం ఉదయం ఓ మహిళ చనిపోయింది. సదరు మహిళ మృతికి మడకం బీడ అలియాస్‌ రాజు (35) అనే వ్యక్తి కారణమని, అతను మంత్రతంత్రాలు చేసి ఆమెను చంపాడని గ్రామస్థులు అనుమానించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు రాజుపై విపరీతంగా దాడి చేయటంతో అతడు మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story