విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీ.. మొత్తానికి పట్టేశారు!

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మంగళవారం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీ.. మొత్తానికి పట్టేశారు!
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మంగళవారం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రబీ మరియు ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన సుమారు 40,834.98 క్వింటాళ్ల CMR ధాన్యం (1,02,087 బస్తాలు) నిల్వ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 9 కోట్ల 47 లక్షల 37 వేలకు పైగానే ఉంటుందని అంచనాకు వచ్చారు.

అంతేకాకుండా నిన్న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీ చేశారు. ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన 3313 క్వింటాళ్ల CMR ధాన్యం (8283 బస్తాలు) నిల్వ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.76 లక్షల 86 వేలకు పైగా ఉంటుందని అంచనాకు వచ్చారు. మిల్లర్‌పై తదుపరి చర్యలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదాయం లీకేజీ కాకుండా, ప్రభుత్వ నిధులు మరియు సహజ వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ కట్టుబడి ఉందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవకతవకలు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు ప్రజలు తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 14432కు కాల్ చేయాలని చెప్పారు.

Next Story