ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-01 15:36:44  IST  )

తెలంగాణ విజిలెన్స్ అధికారులు బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్, బండ్లగూడ ఎమ్మార్వో కార్యాలయాల్లో అకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయాలపై, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై , ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలపై , ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సమెంట్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు తనిఖీలు చెపట్టాయి. విజిలెన్స్ యూనిట్ -1 అధికారులు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది హజరు, వాహనాల రిజిస్ట్రేషన్లల పై తనిఖీలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరించిన ఇద్దరూ జూనియర్ అసిస్టెంట్స్, ఓ కానిస్టేబుల్‌పై విజిలెన్స్ అధికారులు చర్యలు చెపట్టినట్లు తెలుస్తుంది.

అదేవిధంగా మేడ్చల్– మల్కాజ్ గిరి పరిధిలో ఉప్పల్, రామంత్ పూర్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయలపై విజిలెన్ తనిఖీలు చెపట్టారు. సిటి- 2 పరిధిలో బండ్లగూడ, ఫలక్ నూమా ఎమ్మార్వో కార్యాలయలలో తనిఖీలు చెపట్టారు. వరంగల్ యూనిట్ పరిధిలో హన్మకొండలో ప్రితి ఎంటర్ ప్రైజెస్ , భారత్ డిస్ట్రిబ్యూటర్ పై ఆకస్మిక తనిఖీలు చెపట్టారు. దాడులకు సబంధించిన వివరాలను విజిలెన్స్ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story