- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు.. రూ.10.79 కోట్ల అక్రమాలు బట్టబయలు
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఫిబ్రవరి నెలలో జరిపిన తనిఖీల్లో రూ.10.79 కోట్ల అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ మైనింగ్, నిత్యావసర వస్తువుల దారి మళ్లింపుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (Vigilance and Enforcement Department) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 2026, ఫిబ్రవరి నెలలో రవాణా, జీఎస్టీ, గనులు, అటవీ, పోలీస్ శాఖలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీగా అక్రమాలను గుర్తించినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్‌ల వద్ద వెయ్యికి పైగా వాహనాలను తనిఖీ చేయగా, వివిధ నిబంధనల ఉల్లంఘనల కింద 200 వాహనాలను సీజ్ చేసినట్లుగా తెలిపారు. స్పెషల్ రెయిడ్స్ (Special Raids)లో భాగంగా 245 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పాల్గొన్న 6 ఎక్స్‌కవేటర్లు, 15 ట్రాక్టర్లు సహా మొత్తం 24 వాహనాలను జప్తు చేసి, 19 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. పీడీఎస్ (PDS) బియ్యం దారి మళ్లింపుపై జరిపిన తనిఖీల్లో సుమారు 5.8 లక్షల విలువైన 131 క్వింటాళ్ల బియ్యం, 27 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్కడి లోపాలను సరిదిద్దాల్సిందిగా సంబంధిత శాఖలకు నివేదించారు.
ఈ ఒక్క నెలలో నిర్వహించిన ఆపరేషన్లతో ప్రభుత్వ ఆదాయానికి రూ.10.79 కోట్ల గండి పడినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెండ్ డిపార్ట్‌మెంట్ తేల్చింది. అందులో ఇప్పటి వరకు రూ.1.96 కోట్లను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినా.. అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 14432కు తెలియజేయాలని విజిలెన్స్ విభాగం సూచించింది.






