మహిళపై బీజేపీ నాయకుడి అత్యాచారం.. వీడియో రికార్డు చేసి..

by Prasad Jukanti |   (  Updated:2025-12-28 11:08:30  IST  )

మహిళపై ఓ బీజేపీ నేత దారుణానికి పాల్పడ్డాడు.

మహిళపై బీజేపీ నాయకుడి అత్యాచారం.. వీడియో రికార్డు చేసి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కష్టాల్లో ఉన్న ప్రజల అండగా నిలవాల్సిన ఓ రాజకీయ నాయకుడు దారుణానికి పాల్పడ్డాడు. మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో రికార్డు చేసి తాను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి వేదింపులు తాళలేక చివరకు పోలీసులను ఆశ్రయించగా తనను ఎవరూ ఏం చేయలేరని నీ దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ మహిళకు సవాల్ విసిరిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh Crime) సత్నా జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సత్నా జిల్లా (Satna District) రాంపూర్ బాఘేలన్ నగర పరిషత్ కౌన్సిలర్ భర్త అశోక్ సింగ్ అధికార బీజేపీకి చెందిన స్థానిక నాయకుడు. ఆరు నెలల క్రితం అశోక్ సింగ్ (BJP Councillor Husband Ashok Singh) ఓ మహిళ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘోరాన్ని వీడియో రికార్డు చేసి ఈ విషయం ఎక్కడా బయటకు చెప్పవద్దని అలా చెబితే వీడియో బయట పెడతానంటూ బెదిరించాడు. అంతే కాదు ఆమెతో పాటు కుటుంబాన్ని అంతమొందిస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన దారుణం పట్ల లోలోపలే కుమిలిపోతూ వస్తోంది. అయితే ఆమె మౌనాన్ని మరింత అలుసుగా తీసుకున్న అశోక్ సింగ్ తన వేధింపులు తీవ్రతరం చేశాడు. ఈ నెల 20వ మరోసారి బాధితురాలి వద్దకు వెళ్లి తాను చెప్పినట్లుగా చేయాలని బెదిరిచాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన సదరు బాధితురాలు వీడియో రికార్డు చేస్తూ తన వద్ద నుంచి వెళ్లిపోవాలని లేదా పోలీసులకు ఈ వీడియో చూపించి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా అశోక్ సింగ్ మాత్రం ఎవరికి ఫిర్యాదు చేసినా తనకేమి కాదని తనను అడిగే వారెవరూ లేరంటూ విర్రవీగడం ఆ వీడియోలో వినిపిస్తోంది. అశోక్ సింగ్ పై ఐదు రోజుల క్రితమే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు.

కాగా అశోక్ సింగ్ మహిళను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడు అశోక్ సింగ్‍పై కేసు నమోదు చేశారు. సత్నా ఎస్పీ హంసరాజ్ సింగ్ స్పందించారు. డిప్యూటీ ఎస్పీ మనోజ్ త్రివేది ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాగా అశోక్ సింగ్ కు గతంలోనూ నేరచరిత్ర ఉందని అధికార పార్టీ అండతో అతుడు రెచ్చిపోతున్నాడని స్థానికులు ఆరోపింస్తున్నారు. ఇకనైనా అతడి ఆగడాల నుంచి రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో

Next Story