- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లి సహస్రను వెంకట్ హత్య చేశాడు: సీపీ అవినాష్ మహంతి
నగరంలో సంచలనం గా మారిన సహస్ర హత్య కేసును పోలీసులు చేధించారు. పక్క బిల్డింగ్ లో ఉన్న 14 ఏళ్ల బాలుడే బాలికను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

దిశ, వెబ్ డెస్క్/శేరిలింగంపల్లి: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు రోజుల క్రితం జరిగిన బాలిక సహస్ర హత్య (Sahasra murder) కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ (Cricket bat)ను దొంగిలించేందుకు వెళ్లి వస్తుండగా.. బాలిక చూసి అరవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో క్రైమ్ సీన్స్ చూసే బాలికను హత్య చేసినట్లు తేల్చారు. సహస్ర హత్య కేసులో బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు అతను రాసుకున్న నోట్స్.. ప్రవర్తించిన తీరును బట్టి అర్థం అవుతుందని, పోలీసుల విచారణలో పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్ గా వ్యవహరించిన బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్నట్లు స్పష్టం అవుతుంది.
సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mohanty) ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వెల్లడించారు. ఈనెల 18న ఉదయం సహస్ర హత్య జరిగిందని, ఈ కేసులో 3 రోజుల వరకు పెద్దగా క్లూస్ ఏమీ దొరకలేదని, ఎలాంటి పురోగతి కనిపించలేదన్నారు. ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టగా హత్య జరిగిన రోజు, ఆ ఇంటి గోడ సమీపంలో ఓ బాలుడు తచ్చాడినట్లు పక్క ఇంట్లో ఉండే బాలుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టమన్నారు. సహస్రను పక్క ఇంటిలో ఉన్న 14 ఏళ్ల బాలుడు మర్డర్ చేసినట్లు తేలిందన్నారు.
సహస్ర ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో మృతురాలు తమ్ముడు, హత్యకు పాల్పడ్డ బాలుడు క్రికెట్ ఆడుకునే వారని, తనకు ఇవ్వమంటే ఇవ్వలేదని, స్ట్రోక్ బాగున్న ఆ బ్యాట్ ను ఎలాగైనా దొంగలించాలని అనుకున్నాడని తెలిపారు. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని, ఎలా దొంగతనం చేయాలి, ఎవరైనా చూస్తే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, క్లూస్ దొరకక కుండా ఏం చేయాలి అనేది నెల రోజుల క్రితమే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. అనుకున్న విధంగా ఈనెల 18న ఉదయం పక్కింటిలోని ఇంట్లోకి చొరబడి బ్యాట్ దొంగతనం చేసి తీసుకుని వస్తుండగా బాలిక సహస్ర చూడడంతో తన వెంట తీసుకువెళ్లిన కత్తితో బాలికను ఇష్టం వచ్చిన విధంగా పొడిచి చంపాడు.
అనంతరం అక్కడే మర్డర్ చేసిన కత్తిని కడిగేసి, టెర్రస్ గోడ దూకి తన ఇంటిలోకి వెళ్లి రక్తపు మరకలు అంటిన బట్టలను వాషింగ్ మెషిన్ లో వేశాడని, అనంతరం ఏమీ తెలియనట్టు మళ్లీ అదే ప్రాంతంలో ఏమీ తెలియనట్టు తిరగాడని సీపీ తెలిపారు. ఓ బాలుడి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టగా దర్యాప్తును పక్కదారి పట్టించేలా లేని విషయాలు చెప్పాడన్నారు. పక్కా ఆధారాలతో ఈ కేసును ఛేదించామని అన్నారు. మర్డర్ కు పాల్పడిన చోట క్లూస్ దొరికాయని, స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేశాడని, నెల రోజుల నుంచి ఇదంతా ప్లాన్ చేసుకున్నాడన్నారు.
ఓటీటీలు, మిస్టరీ సినిమాలు చూసే ఇదంతా చేశాడని అన్నారు. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు కూడా తెలియదని, మర్డర్ జరిగిన తర్వాత కాస్త భయం భయంగా ఉన్న బాలుడిని అతని తల్లి నువ్వేమైన చేశావా అని అడిగితే రెండవ రోజు నువ్వే పట్టించేలా ఉన్నావని అన్నాడని ఆమె విచారణలో తెలిపిందన్నారు.
మేము డబ్బులు ఇవ్వకుండానే ఓ ఫోన్ కొనుకున్నాడని, అదెలా వచ్చింది అంటే సమాధానం చెప్పలేదని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు సీపీ తెలిపారు. అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు తెలిపారు. బ్యాట్ కొనీయమని అడగాలంటే ఫ్యామిలీ మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే దొంగతనం చేసేందుకు సిద్ధమైనట్లు బాలుడు విచారణలో వెల్లడించినట్లు సీపీ వెల్లడించారు. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.
Read More..
నా బిడ్డను చంపినోడికి భూమ్మిద బతికే హక్కు లేదు: సహస్ర తండ్రి ఎమోషనల్ కామెంట్స్
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర కుటుంబ సభ్యులు ధర్నా...






