నా బిడ్డను చంపినోడికి భూమ్మిద బతికే హక్కు లేదు: సహస్ర తండ్రి ఎమోషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్‎పల్లి బాలిక సహస్ర (Sahasra) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించిన విషయం తెలిసిందే.

నా బిడ్డను చంపినోడికి భూమ్మిద బతికే హక్కు లేదు: సహస్ర తండ్రి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్‎పల్లి బాలిక సహస్ర (Sahasra) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించిన విషయం తెలిసిందే. 10వ తరగతి చదివే అబ్బాయే సహస్రను హతమార్చినట్లుగా నిర్ధారించారు. అతడు మృతురాలు సహస్ర ఇంటి పక్క బిల్డింగ్‎లోనే నిందితుడు ఉంటున్నట్లు పోలీసులు. క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వెళ్లి అడ్డొచ్చిన సహస్రను నిందితుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. ఈ నేపథ్యంలోనే సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డను చంపినోడికి భూమ్మిద బతికే హక్కు లేదని కామెంట్ చేశారు. అలంటి క్రిమినల్స్‌ను వదిలేస్తే.. తన లాంటి తల్లితండ్రులను ఎంతోమందిని ఏడిపిస్తాడని కన్నీరు పెట్టారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చట్టం, పోలీసులు, ప్రభుత్వం వాడిని మైనర్ అని, బాలుడని పరిగణించొద్దని విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను చంపిన తర్వాత తమ మధ్యే తిరుగుతూ.. తన కొడుకుని ఏడవకు ఏడవకు అంటూ ఓదార్చాడని తెలిపారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని.. హత్యలో వాళ్ల ప్రమేయం కూడా ఉందని సహస్ర తండ్రి ఆరోపించారు.

Next Story