- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Naga Rani Yarlagadda |
అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కసింకోట మండలం ఉక్కినపాలెం వద్ద జాతీయ రహదారిపై లారీని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం కారణంగా ఉక్కినపాలెం నుంచి ఎలమంచిలి వరకూ వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేలా చర్యలు చేపట్టారు.
Next Story






