Vaishali Kidnapping Case: నవీన్ రెడ్డి స్టేట్‌మెంట్ కాపీలో సంచలన విషయాలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-15 04:59:43  IST  )

మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డి స్టేట్‌మెంట్ కాపీలో పలు కీలక విషయాలను వెల్లడించాడు.

Vaishali Kidnapping Case: నవీన్ రెడ్డి స్టేట్‌మెంట్ కాపీలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఆదిభట్ల మన్నెగూడకు చెందిన బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డి స్టేట్‌మెంట్ కాపీలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. తనకు వైశాలితో వివాహం జరగలేదన్నాడు. వైశాలి పెళ్లి ఆపాలని బాపట్ల పెళ్లి డ్రామా ఆడానని తెలిపాడు.పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్ చేశానన్నాడు. మిస్టర్ టీకి చెందిన 40 మందితో కిడ్నాప్ చేయించానని తెలిపాడు. వైశాలిని కిడ్నాప్ చేసి ఆమెపై దాడి చేశానని తెలిపాడు. కిడ్నాప్ ఇష్యూ పెద్దది కావడంతో భయపడ్డానని పేర్కొన్నాడు. రుబెన్ సాయంతో వైశాలని వదిలేసి గోవా పారిపోయానని తెలిపాడు. వైశాలి ఎవరికి దక్కకూడదనే కిడ్నాప్ చేశానన్నాడు. కాగా నవీన్ రెడ్డిని మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గోవాలో పట్టుకున్నారు.

Also Read..

తిరుమలాయపాలెంలో డేంజర్ బెల్స్.. వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి

Next Story