Dr Vaishali Kidnap Case : వెలుగులోకి సంచలన విషయాలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-10 06:43:18  IST  )

మన్నెగూడలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ ఘటనకు సంబంధించి తండ్రి పలు కీలక విషయాలను వెల్లడించారు.

Dr Vaishali Kidnap Case : వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: మన్నెగూడలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ ఘటనకు సంబంధించి తండ్రి పలు కీలక విషయాలను వెల్లడించారు. నవీన్‌తో వైశాలి వివాహం అవాస్తవమని కొట్టిపడేశారు. నవీన్ రెడ్డి పోలీసులను తప్పు దారి పట్టిస్తు్న్నాడని ఆరోపించారు. 2021 అగస్టు‌న వైశాలి ట్రీట్ మెంట్ తీసుకుందని తెలిపారు. ఆర్మీ డెంటల్ ఆసుపత్రిలో వైశాలికి చికిత్స చేయించామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు తమ వద్ద ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా నవీన్ మాత్రం తాము బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. బీడీఎస్ పూర్తయ్యే వరకు ఫోటోలు బయటకు రావద్దని వైశాలి కండీషన్ పెట్టినట్లు తెలిపాడు.2021 జనవరి నుంచి ప్రేమించుకుంటున్నట్లు పోలీసులకు తెలిపాడు. వైశాలి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని ఆరోపించాడు. వైశాలికి వోల్వో కారు, తండ్రికి 2 కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపాడు.

Read more:

వైశాలి కిడ్నాప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్....రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి కీలక ఆదేశం

Next Story