- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి అక్రమ సంబంధం.. తండ్రితో కలిసి తల్లిని చంపిన కొడుకు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన వడ్ల సరోజా (40) అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసు దర్యాప్తులో

దిశ, అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన వడ్ల సరోజా (40) అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసు దర్యాప్తులో హత్య మిస్టరీ బయటపడింది. గతంలో తన భర్తతో విడిపోయిన సరోజా, పిల్లలతో కలిసి అయిజలో ఉంటూ జీవనం కొనసాగిస్తుండగా, ఆమె అక్రమ సంబంధం కారణంగా ఆమె మాజీ భర్త వడ్ల రామచారి, అతని కుమారుడు వినోద్ కలసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 1న మధ్యాహ్నం సరోజ ఇంట్లో తీవ్ర గాయాలతో పడివుండటం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. తమ్ముడు నరసింహ చారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, శాంతినగర్ సీఐ టాటా బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, రెండు రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో బాధితురాలు గత కొంతకాలంగా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని, దీనివల్ల ఆమె భర్త రామచారి (A1), కుమారుడు వినోద్ (A2) మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. గతంలోనూ ఈ కారణంగా కుటుంబ గొడవలు జరుగుతుండగా, చివరికి తండ్రి-కొడుకు కలిసి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. జూలై 1న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొడవ జరిపి, ఆమె తల బండరాయికి బాదడం ద్వారా హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని మంచంపై పడవేసి, బట్టతో కప్పి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ కేసును ఛేదించడంలో అయిజ ఎస్సై పి. శ్రీనివాస రావు, శాంతినగర్ సీఐ టాటా బాబు నేతృత్వంలో ప్రత్యేక టీం కీలకపాత్ర పోషించింది. నిందితుల వద్ద నుంచి మోటార్‌సైకిల్, రక్తంతో ఉన్న బట్టలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నిర్ధారణతో మర్డర్ మిస్టరీ పూర్తిగా వీడింది.
ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తి. శ్రీనివాసరావు అభినందించారు. అందులో ఎస్సై పి. శ్రీనివాస రావు, హెచ్‌సీలు యాకూబ్ హుస్సేన్, రంజిత్, కానిస్టేబుళ్లు ప్రసాద్, రాజు, తులసీరాం నాయుడు ఉన్నారు.






