విజయవాడ నగరంలో కలకలం.. ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-24 03:12:33  IST  )

విజయవాడ వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఉగ్రవాద సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ నగరంలో కలకలం.. ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada) నగరంలోని వించిపేట (Vinchipeta)లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సోషల్ మీడియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా పోస్ట్‌లు పెడుతూ, యువతను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు (ACP Durga Rao) ఈ దాడులను ధ్రువీకరించారు. వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఘటనతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని, వారికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.

Next Story