యూపీ రోడ్డు ప్రమాదం.. ఏకంగా 13కు చేరిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 07:32:58  IST  )

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది.

యూపీ రోడ్డు ప్రమాదం.. ఏకంగా 13కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. ఢిల్లీ (Delhi)- ఆగ్రా (Agra) ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించగా.. క్రమంగా మృతుల సంఖ్య 13 చేరింది. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ సందర్భంగా మథురా రూరల్ ఎస్పీ సురేష్‌చంద్ర రావత్ మాట్లాడుతూ.. ప్రమాదంలో డెడ్‌బాడీలు పూర్తిగా కాలిపోవడంతో కుంటుంబ సభ్యుల నుంచి శ్యాంపిల్స్ స్వీకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాలను గుర్తించి వారికి అప్పగించనున్నట్లుగా ఎస్పీ స్పష్టం చేశారు.

Next Story