దారుణం.. మాంత్రికుడు చెప్పాడని మనువడిని హత్య చేసిన తాత.. తల, మొండెం వేరు చేసి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మాంత్రికుడు చెప్పాడని మనువడిని దారుణంగా హత్య చేశాడు తాత. ఆగస్టు 26న ఈ ఘటన జరగ్గా బాధిత తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే శరణ్ సింగ్ కొడుకు,

దారుణం.. మాంత్రికుడు చెప్పాడని మనువడిని హత్య చేసిన తాత.. తల, మొండెం వేరు చేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మాంత్రికుడు చెప్పాడని మనువడిని దారుణంగా హత్య చేశాడు తాత. ఆగస్టు 26న ఈ ఘటన జరగ్గా బాధిత తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే శరణ్ సింగ్ కొడుకు, కూతురు 2023, 2024లో సూసైడ్ చేసుకున్నారు. ఒక్క ఏడాది తేడాతో ఇద్దరు పిల్లలను కోల్పోయాడు శరణ్ సింగ్. అసలు ఎందుకిలా జరుగుతోందని ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. సమీప బంధువు, వరుసకు మనవడైన యశ్ బ్రతికి ఉండటమే ఇందుకు కారణమని.. అతన్ని బలిగా ఇస్తే దోషం పోతుందని సూచించాడు.

దీంతో పదిహేడేళ్ల యశ్‌ను స్కూల్ దగ్గర కిడ్నాప్ చేసిన శరణ్ సింగ్.. మాంత్రికుడు చెప్పినట్లుగా గొంతు కోసి హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి.. ఒక్కో భాగాన్ని, ఒక్కో చోట పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ఇక అదే సమయంలో యశ్ తల్లి కామినీ దేవి.. కొడుకు మిస్సింగ్ కేసు పెట్టింది. అదే రోజు నైనీ పారిశ్రామిక ప్రాంతంలో శరీర భాగం లభించింది కానీ గుర్తుపట్టలేకపోయారు. నెక్స్ట్ డే సైద్‌పూర్ ప్రాంతంలో తల కనిపించడంతో యశ్‌గా గుర్తించారు.

Next Story