రూ.500లకు కక్కుర్తిపడ్డ పోలీస్, లాయర్.. కట్ చేస్తే..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్, మహిళా న్యాయవాది కలిసి జైలులో ఉన్న రౌడీ షీటర్‌కు మొబైన్ ఫోన్ అందించగా.. అతను ఓ వ్యాపారవేత్తకు కాల్ చేసి బెదిరించాడు.

రూ.500లకు కక్కుర్తిపడ్డ పోలీస్, లాయర్.. కట్ చేస్తే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్, మహిళా న్యాయవాది కలిసి జైలులో ఉన్న రౌడీ షీటర్‌కు మొబైన్ ఫోన్ అందించగా.. అతను ఓ వ్యాపారవేత్తకు కాల్ చేసి బెదిరించాడు. మర్డర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వ్యాపారవేత్త వీరేంద్ర రాజ్‌పుత్ ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ బయటపెట్టాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలోనూ లీక్ కాగా వైరల్ అయిపోయింది. దీంతో పోలీసు అధికారులు కూడా షాక్ అయ్యారు.

దీనిపై విచారణ జరపగా.. లాకప్ డ్యూటీలో ఉండే పోలీసు కానిస్టేబుల్, మహిళా లాయర్ రూ. 500 కోసం కక్కుర్తి పడినట్లు తేలింది. ఖైదీల దగ్గర డబ్బులు తీసుకుని ఫోన్ మాట్లాడిస్తారని.. తమ బంధువులకు ఫోన్ చేసుకునే వీలు కల్పిస్తారని నిర్ధారణ అయింది. దీంతో పోలీసు, లాయర్‌ను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా ఈ ఘటన ఝాన్సీలో చట్టం మరియు శాంతిభద్రతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.

Next Story