యూపీలో దారుణం.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు కొడుకు. ఘాజీపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పేరెంట్స్ కూతురికి కొంత భూమి రాసివ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. వాగ్వాదానికి దిగాడు

యూపీలో దారుణం.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు కొడుకు. ఘాజీపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పేరెంట్స్ కూతురికి కొంత భూమి రాసివ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కోపంలో ముగ్గురిని గొడ్డలితో నరికాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా మానవత్వం చనిపోయిందని.. డబ్బు, ఆస్తులకే ప్రాధాన్యత పెరిగిపోయిందనే చర్చ జరుగుతోంది.


Next Story