నిర్మల్‌పూర్‌లో అక్రమంగా మసీదు నిర్మాణం.. 29 మందిపై కేసు నమోదు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్‌లోని నిర్మల్ పూర్‌లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అక్రమంగా మసీదు నిర్మాణం చేస్తున్నారని.. హిందూ సమాజ సభ్యులు చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేశారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు వినతిపత్రం అందించారు.

నిర్మల్‌పూర్‌లో అక్రమంగా మసీదు నిర్మాణం.. 29 మందిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్‌లోని నిర్మల్ పూర్‌లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అక్రమంగా మసీదు నిర్మాణం చేస్తున్నారని.. హిందూ సమాజ సభ్యులు చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేశారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు వినతిపత్రం అందించారు. ఆగస్టు 24న ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా మసీదు కడుతున్నారని ఫిర్యాదు చేయడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గోడ నిర్మాణాన్ని నిలిపేశారు. నిజానికి ఈ మసీదు నిర్మాణాన్ని 15 ఏళ్ల క్రితమే.. అంటే 2014లోనే అడ్డుకున్నారు పోలీసులు. మళ్లీ ఇప్పుడు కొత్తగా గోడ కడుతుండటంతో చౌకీదారు భగవత్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. 29 మందిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. కాగా కలెక్టర్ ఈ విషయంపై విచారణ బాధ్యతలను తహసీల్దార్, ఇన్చార్జ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.

Next Story