UP Constable: మరో పోలీస్ తో లేడీ కానిస్టేబుల్ రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 03:50:48  IST  )

UP Constable: మరో పోలీస్ తో లేడీ కానిస్టేబుల్ రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంట్లో తాను లేనప్పుడు తన ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ (constable Lady) భాగోతాన్ని ఆమె భర్త రట్టు చేశాడు. మరో వ్యక్తితో తన భార్య ఏకంగా తమ ఇంట్లోనే కలిసి ఉండగా పట్టుకుని దాడి చేశాడు. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖుషీనగర్ జిల్లా కస్య పట్టణంలో ఓ వ్యక్తి యూపీ పోలీస్ శాఖలో (Uttar Pradesh police) కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సైతం కానిస్టేబుల్ గా జాబ్ చేస్తోంది. ఈ జంట పట్టణంలోని ఒక అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ వేర్వేరు పోలీస్ స్టేషన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం 8 గంటలకు డ్యూటీ నుంచి భర్త ఇంటికి వచ్చాడు. అయితే గదిలో తన భార్య ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూసి షాక్ తిన్నాడు. భర్త రాకను గమనించిన భార్య వెంటనే తన ప్రియుడిని గదిలోపల ఉంచి తలుపు లాక్ చేసింది. దాంతో భర్త కూడా బయటి వైపున గదిని లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫోన్ తో అక్కడికి చేరుకున్న పోలీసులు చాలా కష్టపడి తలుపు తెరిచారు. ఈ క్రమంలో తలుపులు తెరవగానే భార్య ప్రియుడిపై భర్త దాడి చేశాడు. ముగ్గురిని స్టేషన్ కు తరలించిన పోలీసు భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా ప్రియుడు కూడా మరో స్టేషన్ లో కానిస్టేబులే కావడం గమనార్హం. తాను డ్యూటీకి వెళ్లినప్పుడు తన భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటోందని ఆరోపించారు. ఇక తాను ఆమెతో కలిసి జీవించలేనని అమె తనను చంపేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story