రాష్ట్రంలో బీజేపీ నాయకుడి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి.. శవాన్ని రైలు పట్టాలపై విసిరేసి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లా బీజేపీ నాయకుడు రణ్‌వీర్ యాదవ్ హత్య కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది రాజకీయ హత్య కాదని.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఓ మహిళ హత్యకు, ఈ

రాష్ట్రంలో బీజేపీ నాయకుడి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి.. శవాన్ని రైలు పట్టాలపై విసిరేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లా బీజేపీ నాయకుడు రణ్‌వీర్ యాదవ్ హత్య కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది రాజకీయ హత్య కాదని.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఓ మహిళ హత్యకు, ఈ నాయకుడి హత్యకు లింక్ ఉందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు నెలల క్రితం డాక్టర్ ఉదయ్ యాదవ్.. తన భార్య అంజలి, ఫ్రెండ్ రణ్‌వీర్‌తో కలిసి నైనిటాల్ వెకేషన్‌ వెళ్లారు. ముగ్గురికి ఒకే హోటల్ గది బుక్ చేసుకున్నారు. అయితే డాక్టర్ ఉదయ్ ఆ రోజు రాత్రి భార్యను రణ్‌వీర్‌తో సన్నిహితంగా ఉండడాన్ని చూడటంతో డెత్ గేమ్ స్టార్ట్ అయింది.

జూలై 11న అంజలి తన ఇంట్లోనే శవంగా మారింది. కానీ పోలీసులు రాకముందే దహనసంస్కారాలు చేయడంతో పోస్టుమార్టం చేసే వీలు లేకుండా పోయింది. కాగా ఇప్పుడు ఈ కేసు.. నాయకుడి కేసులో ప్రధానంగా మారింది. ఇక ఆగస్టు 22న రణ్‌వీర్ నవాబ్ గంజ్‌లోని ఓ దాబాలో స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. ఆ రాత్రే అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తర్వాత చిత్రకూట్ ఫారెస్ట్ ఏరియాలో అతని స్కార్పియో కనిపించగా.. ఆ తర్వాత రైల్వే ట్రాక్‌పై ఎనిమిది ముక్కలుగా నరికిన శవం దొరికింది. డీఎన్‌ఏ టెస్ట్‌తో ఆ శవం రణ్‌వీర్‌దేనని కన్ఫర్మ్ అయింది. కాగా డాక్టర్ ఉదయ్.. తన భార్యను, ఆమె ప్రియుడైన రాజకీయ నాయకుడు రణ్‌వీర్‌ను పక్కా ప్లాన్‌తోనే హత్య చేయించాడని అనుమానిస్తున్నారు పోలీసులు. తన కుటుంబీకులు, స్నేహితులతో కలిసి ఈ మర్డర్ చేశాడని భావిస్తున్నారు. కాగా ఉదయ్ ఫ్రెండ్స్ రామ్ సింగ్, సుజిత్ శ్రీవాస్తవ, సోదరుడు విజయ్ యాదవ్, అత్త లీలా యాదవ్ ఇందుకు హెల్ప్ చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే లీలా యాదవ్, రామ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

Next Story