రాష్ట్రంలో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చిన పదకొండేళ్ల చిన్నారి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. పదకొండేళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు కాసేపటికే మరణించిందని తెలిపారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దర పిల్లల తండ్రి అయిన 31ఏళ్ల రషీద్..

రాష్ట్రంలో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చిన పదకొండేళ్ల చిన్నారి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. పదకొండేళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు కాసేపటికే మరణించిందని తెలిపారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దర పిల్లల తండ్రి అయిన 31ఏళ్ల రషీద్.. బాధిత బాలికకు పండ్లు ఇస్తానని ఆశచూపి ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో తీసి.. బయటకు చెప్తే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ.. పదే పదే రేప్ చేశాడు.

కుటుంబాన్ని ఏం చేస్తాడేమోననే భయంతో పాప నోరు మెదపలేదు. కానీ చిన్నారికి నడుము నొప్పి రావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆల్ట్రాసౌండ్ చేయగా.. ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. ఏడు నెలల గర్భంతో ఉన్న ఆమె పాపకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన కాసేపటికే మరణించింది. బాలికకు రక్తస్రావం అధికం కాగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రషీద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నట్లు తెలిపారు.

Next Story