రోజూ ఫిల్టర్‌ వీడియో కాల్స్.. తీరా కలిస్తే 52ఏళ్ల మహిళ..పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో.. భరించలేని కుర్రాడు..

by Sujitha Rachapalli |

యూపీలోని మణిపురిలో జరిగిన లవ్ అండ్ మర్డర్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టా ఫిల్టర్స్ ఇంత ఘోరం చేస్తున్నాయా అని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే. 25ఏళ్ల కుర్రాడు అరుణ్ రాజ్‌పుత్‌కు రాణి అనే

రోజూ ఫిల్టర్‌ వీడియో కాల్స్.. తీరా కలిస్తే 52ఏళ్ల మహిళ..పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో.. భరించలేని కుర్రాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీలోని మణిపురిలో జరిగిన లవ్ అండ్ మర్డర్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టా ఫిల్టర్స్ ఇంత ఘోరం చేస్తున్నాయా అని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే. 25ఏళ్ల కుర్రాడు అరుణ్ రాజ్‌పుత్‌కు రాణి అనే మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే క్లోజ్ అయిపోయారు. రోజూ వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు. కానీ రాణి తన వీడియో కాల్స్‌లో ఫిల్టర్స్ ఉపయోగించేది. అందంగా కనిపించేది.

అయితే ఓ రోజు అరుణ్‌.. ఆమెను డైరెక్ట్‌గా కలుద్దామని పిలిచాడు. షాక్ అయిపోయాడు. కారణం ఆమె 52ఏళ్ల స్త్రీ. ఇప్పటికే ఆమెకు పెళ్లి అయింది కూడా.అయితే ఆమెను కలిసిన రోజు ఇద్దరు హోటల్‌లో గడపగా.. ఆ తర్వాత రాణి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. భర్త రాజ్‌పాల్‌కు విడాకులిస్తానని.. వివాహం చేసుకుందామని చెప్తూనే ఉంది. కానీ ఇందుకు ఒప్పుకోని అరుణ్.. ఒత్తిడి భరించలేక.. మీట్ అవుదామని పిలిచి.. ఆమెను హత్య చేశాడు. కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖర్పరి బంబా దగ్గరలో మృతదేహాన్ని పడేశాడు. ఈ శవం చూసిన స్థానికులు సమాచారం అందించగా.. పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు అరుణ్‌ రాజ్‌పుత్‌ను అరెస్ట్ చేశారు.

Next Story