- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం
గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్ష పల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ,సత్తుపల్లి: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్ష పల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, రుద్రాక్ష పల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన వాగులో గుర్తుతెలియని మృతదేహాన్ని వాహనదారులు, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రదీప్ పోలీసులు సిబ్బంది తో కలిసి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి మృతుడు స్థానికుడా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వాడా, హత్య, ఆత్మహత్యా, అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు మృతుడి సంబంధిచిన వివరాలు లభించకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






