- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మహిళ మృతి..
గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.

X
దిశ, మేడిపల్లి : గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెంగిచర్ల గ్రామంలో గత పదిసంవత్సరాల నుండి లక్ష్మి (45) నివాసం ఉంటూ వైన్ షాపులలో ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తుండేది. అలా పనులు చేస్తూ తాను కూడా మద్యానికి బానిస అయిందని తెలిపారు.
కాగా గురువారం మధ్యాహ్నం హనుమాన్ నగర్ రోడ్ ప్రక్కన చనిపోయి ఉండటం స్థానికులు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఆమె ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు ఏవీ కూడా స్థానికులకు తెలియదన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చిరిలో భద్రపరిచామని, ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలిసినా మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగలరని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ కోరారు.
Next Story






