లాలాగూడ–మౌలాలి రైల్వే పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Taduka Kalyani |

లాలాగూడ–మౌలాలి మధ్య అప్ మెయిన్ లైన్ రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది.

లాలాగూడ–మౌలాలి రైల్వే పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
X

దిశ, సికింద్రాబాద్: లాలాగూడ–మౌలాలి మధ్య అప్ మెయిన్ లైన్ రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ అందించిన సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో మృతుడు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. రైల్వే పట్టాలు దాటే క్రమంలో గానీ, ఇతర కారణాలతో గానీ గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 326/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని అధికారులు తెలిపారు. మృతుడు తెలుపు రంగు పుల్ షర్ట్‌పై నలుపు రంగు గీతలు ఉన్న దుస్తులు, నలుపు రంగు కాటన్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎడమ ఛాతీ భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లు గుర్తించారు. మృతుడు హిందూ మతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే రైల్వే పోలీసులను 94400 83160 లేదా 87126 50581 నంబర్లలో సంప్రదించాలని అధికారులు కోరారు.

Next Story