హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌ ‘సర్దార్-2’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్

by Mallepaka Hamsa |

ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ స్పై యాక్షన్ సీక్వెల్.. విడుదలకు సిద్ధమైంది.

హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌ ‘సర్దార్-2’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్-2’. ఈ సినిమా 2022లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సర్దార్’’కు సీక్వెల్‌గా రాబోతోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగంలో నటించిన రజీషా విజయన్‌తో పాటు ఈ సీక్వెల్‌లో ఎస్‌.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నిజానికి, 2024 జూలైలోనే షూటింగ్ ప్రారంభమైన మూడో రోజే సెట్‌లో ఒక ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏడుమలై అనే స్టంట్‌మ్యాన్ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి చనిపోవడంతో షూటింగ్ కొన్నాళ్లు వాయిదా పడింది.

ఆ సమయంలో కార్తి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ స్పై యాక్షన్ సీక్వెల్.. విడుదలకు సిద్ధమైంది. తాజాగా, ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో కార్తి చేతిలో గన్ పట్టుకుని ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ పేలుడు జరగడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సీక్వెల్‌లో కూడా కార్తీ డ్యూయల్ రోల్‌లో ఏజెంట్ సర్దార్ అలియాస్ చంద్రబోస్, విజయ్ ప్రకాష్ పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story