జూరాల కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

by Bhanu |

మండల పరిధిలోని గోపాలదిన్నె గ్రామ సమీపంలో ఉన్న జూరాల మెయిన్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది.

జూరాల కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
X

దిశ, వీపనగండ్ల: మండల పరిధిలోని గోపాలదిన్నె గ్రామ సమీపంలో ఉన్న జూరాల మెయిన్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్‌ఐ కె. రాణి మీడియాకు తెలిపారు. కాలువలో అనుమానాస్పదంగా తేలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ రాణి పేర్కొన్నారు.

Next Story