- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మృతదేహం ఎవరిదో తెలిసిపోయింది.. కానీ హత్యా? ఆత్మహత్యా..?
వనపర్తి జిల్లా రేపల్లి మండలంలో దసరా రోజు కలకలం సృష్గించిన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ లభ్యం అయింది.

దిశ, రేవల్లి : వనపర్తి జిల్లా రేపల్లి మండలంలో దసరా రోజు కలకలం సృష్గించిన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ లభ్యం అయింది. నాగపూర్ గ్రామ ఊర చెరువులో మృతి చెందిన వ్యక్తి నాగర్ కర్నూల్ మండలంలోని గుడిపళ్లికి చెందిన మధురాజు పర్వతాలు(40)గా గుర్తించినట్లు ఎస్ఐ రజిత తెలిపారు.ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ వెల్లడించారు. మృతుడు పర్వతాలు గత రెండురోజుల క్రితం భార్య కవితతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, దీనిపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. స్థానిక పోలీసులు పర్వతాలు ఆచూకీ కోసం ఎంత వెతికిన లభ్యం కాలేదన్నారు.అయితే గురువారం ఉదయం నాగపూర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు తెలియడంతో భార్య కవిత వచ్చి చూసి ఆ మృతదేహం తన భర్తదేనని గుర్తించిందని ఎస్ రజిత చెప్పారు.
పర్వతాలు మృతిపై గ్రామస్తుల అనుమానాలు
అయితే పర్వతాలు మృతిపై ఇటు భార్య, అటు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య చిన్న గొడవే జరిగిందని, ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమిద్దరి మధ్య లేవని భార్య కవిత విలపిస్తోంది. ఒకవేల గొడవే జరిగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే సమీపంలో ఎన్నో చెరువులు ఉండగా 6,7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపూర్ చెరువుకు ఎందుకు వెళ్తాడని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అలా అని మృతుడిని హత్యా చేయాల్సినంత పగలు, గొడవలు గ్రామంలో ఎవరికి లేవని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్న పర్వతాలు మృతి మిస్టరీ తేలాలంటే పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది. మృతుని భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజిత తెలిపారు.






