- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రసూల్ పురా ఇందిరమ్మనగర్ నాలాలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహానికి ..

X
దిశ, బేగంపేట: బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రసూల్ పురా ఇందిరమ్మనగర్ నాలాలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి కొంత భాగం కొట్టుకువచ్చింది. సాయంత్రం ప్రాంతంలో మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన స్థితిలో మృతదేహంలోని కొంత భాగం నాలాలో తేలుతుండటాన్ని గుర్తించారు.
మృతదేహం భాగాన్ని నాలా నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడైనా శ్మశానంలో కాలిన మృతదేహంలోని కొంత భాగం నాలాలో పడి కొట్టుకుని వచ్చి ఉంటుందని బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు. మృతదేహంలోని కేవలం కొంత భాగం మాత్రమే నాలాలో కొట్టుకుని వచ్చిందని అది మహిళా, లేక పురుషుడా అనేది ఇప్పుడే ఏమి చెప్పలేమన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story






