- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండ్లవాగు వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం..
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా సమీపంలోని గుండ్లవాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది.

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా సమీపంలోని గుండ్లవాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. సోమవారం ఉదయం గుండ్లవాగు ఒడ్డున మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పస్రా పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. మృతుడు సుమారు 30-35 సంవత్సరాల వయస్సు కలిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.
శరీరం పాడైపోతున్న స్థితిలో ఉండటంతో గుర్తింపు వ్యవహారం క్లిష్టంగా మారింది. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య చేసివేసిన కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికుల నుండి సమాచారం సేకరించడంతో పాటు, ఇటీవల ఎవ్వరైనా అదృశ్యమైనారా అనే కోణంలో పరిసర గ్రామాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.






