పాపం నిన్న నామినేష‌న్.. ఇవాళ తిరిగిరాని లోకాల‌కు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, మామడ : మండ‌ల ప‌రిధిలోని పొన్కల్ గ్రామానికి చెందిన దుబాక జమున (45) ఆదివారం అక‌స్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందింది. శనివారం గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యురాలిగా

పాపం నిన్న నామినేష‌న్.. ఇవాళ తిరిగిరాని లోకాల‌కు..!
X

దిశ, మామడ : మండ‌ల ప‌రిధిలోని పొన్కల్ గ్రామానికి చెందిన దుబాక జమున (45) ఆదివారం అక‌స్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందింది. శనివారం గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేశారు. ఇవాళ ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెళ్లి చూడగా అప్ప‌టికే మరణించింది. అందరితో కలిసి మెలిసి ఉండే జమున తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కన్నీరు మున్నీరయ్యారు.

Next Story