- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శబరిమలలో అనుకోని విషాదం.. క్యూలైన్‌లో మహిళ మృతి
పవిత్ర కార్తీక మాసం ముగుస్తుండటంతో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు శబరిమలకు పోటెత్తారు.

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర కార్తీక మాసం ముగుస్తుండటంతో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు శబరిమలకు పోటెత్తారు. సుదీర్ఘ విరామం తర్వాత భక్తుల దర్శనం కోసం శబరిమల ఆలయాన్ని తెరవగా.. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో శబరిమల ఆలయంలో భారీ రద్దీ కారణంగా మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లో భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణించింది. గత కొన్ని రోజులుగా పెరిగిన రద్దీని సమర్థంగా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లపై కేరళ హైకోర్టు ఆగ్రహం
శబరిమలలో మహిళ భక్తురాలు మృతి నేపథ్యంలో శబరిమల ఏర్పాట్లపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దీకి తగ్గట్టుగా సక్రమమైన ఏర్పాట్లు చేయకపోతే పెద్ద విపత్తు తప్పదని హెచ్చరించింది. ఆరు నెలల ముందే సిద్ధం కావాల్సిన పనులను ఎందుకు సకాలంలో చేయలేదని దేవస్థానం బోర్డును ప్రశ్నించింది. శుక్రవారం లోపు పూర్తి వివరణ సమర్పించాలని ఈ సందర్భంగా కేరళ హైకోర్టు శబరిమల దేవస్థానం బోర్డును ఆదేశించింది.






