- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగం రావడం లేదని యువకుడు ఆత్మహత్య..
by Bhanu |
ఉద్యోగం రావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక రైల్వే

X
దిశ, చిట్యాల : ఉద్యోగం రావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. నల్గొండ రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రూపని అఖిల్ (25) డిగ్రీ పూర్తి చేసి గత కొద్ది నెలలుగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయితే ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కడ కూడా సరైన ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక స్టేషన్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు..
Next Story






