మైక్రో ఫైనాన్స్ చెల్లించ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

మైక్రో ఫైనాన్స్ ద్వారా పొందిన రుణానికి సంబంధించి లోన్ చెల్లించే విష‌యంలో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న భిక్క‌నూరు మండ‌ల కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

మైక్రో ఫైనాన్స్ చెల్లించ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, భిక్క‌నూరు : మైక్రో ఫైనాన్స్ ద్వారా పొందిన రుణానికి సంబంధించి లోన్ చెల్లించే విష‌యంలో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న భిక్క‌నూరు మండ‌ల కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజ‌నేయులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల కేంద్రానికి చెందిన తునికి వేణు(28) కూలీ ప‌ని చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం త‌న ఇంటిపై మైక్రో ఫైనాన్స్ ద్వారా రూ.5ల‌క్ష‌లు రుణం తీసుకున్నాడు. కొద్ది రోజుల నుంచి తీసుకున్న లోన్ కు ఇన్ స్టాల్ మెంట్ ఎలా చెల్లించాల‌ని బాధ‌ప‌డుతుండేవాడు. భార్య మ‌మ‌త ఏ క‌ష్టం చేసైనా స‌రే లోన్ చెల్లిద్దామ‌ని స‌ర్ది చెప్పేది. లోన్ చెల్లింపు విష‌యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఒకరోజు ముందు పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు హర్షిత(3) ధనుశ్రీ (15 నెలలు)లు ఉన్నారు. భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆంజనేయులు వెల్ల‌డించారు.

Next Story