- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
భర్త అనుమానంతో వేధిస్తున్నాడని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ,వీణవంక : భర్త అనుమానంతో వేధిస్తున్నాడని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ తోట తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆకుల తిరుప (37) అనే మహిళ తన భర్త తనని రోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తూ అనుమానం పెంచుకున్నాడని జీవితంపై విరక్తి చెంది పది రోజుల క్రితం పురుగుల మందు తాగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. తన కూతురు చావుకు అల్లుడు ఆకుల రాములే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- suicide
Next Story






