- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య అక్రమ సంబంధం.. భర్త ఆత్మహత్య
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి వేధించారు.

దిశ, మర్పల్లి : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండల పరిధిలోని కొంశెట్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాహుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంశెట్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల భార్య భర్తలు. అయితే రత్నమాల అదే గ్రామానికి చెందిన అనంత్ అనంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇదే విషయం భర్త శ్రీనివాస్ కి తెలియడంతో నిలదీశాడు. దీంతో తమ చీకటి కాపురానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కక్షతో భార్య, ఆమె ప్రియుడు కలిసి శ్రీనివాస్ ను మానసికంగా, భౌతికంగా వేధింపులకు గురి చేశారు. ఇటీవల శ్రీనివాస్ ను కట్టేసి.. అసభ్య కరమైన మాటలతో తిట్టారు. ఎలాగైనా చావొచ్చు కదా అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఫిర్యాదు లో తెలిపినట్టు ఎస్సై వెల్లడించారు. దీంతో అవమానం భరించలేక జీవితం పై విరక్తి చెంది ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్టు సోదరి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని ఎస్సై రాహుఫ్.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై వెల్లడించారు.






