‘దొంగతనం చేసింది నువ్వే ఒప్పుకో’.. ఎస్‌ఐ క్రూరత్వానికి మహిళ బలి?

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-31 09:54:18  IST  )

సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

‘దొంగతనం చేసింది నువ్వే ఒప్పుకో’.. ఎస్‌ఐ క్రూరత్వానికి మహిళ బలి?
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ(Tungaturthi SI) వేధింపులు తాళలేక ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వెంపటి గ్రామానికి చెందిన మల్లయ్య తన ఇంట్లో బంగారం పోయిందని.. తనకు సోమ నర్సమ్మ అనే మహిళపై అనుమానం ఉందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో నర్సమ్మను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. తాను చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు తనను స్టేషన్‌కు పిలిపించి రాత్రి వరకూ విచారణ పేరుతో వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. చోరీ జరిగిన ప్రాంతంలో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా్యి. నువ్వే దొంగతనం చేశావు. ఒప్పుకో.. లేకుంటే.. జైలుకు పంపుతాం అని పదే పదే స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో అనుమానంగా భావించిన నర్సమ్మ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులు తాళలేకనే మా అమ్మ ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలు నర్సమ్మ పిల్లలు ఆరోపిస్తున్నారు. కాగా, ఇదే విషయమై ఎస్ఐని వివరణ కోరగా దాటవేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story