- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భర్త టార్చర్ భరించలేక నిండు గర్భిణి ఆత్మహత్య
by Gantepaka Srikanth |
కరీంనగర్ జిల్లా జిల్లా ఇల్లందకుంట మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా జిల్లా ఇల్లందకుంట మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మౌనిక ఏడు నెలల గర్భిణి. అయితే ఇటీవల అదనపు కట్నం కోసం భర్త ప్రశాంత్ టార్చర్ పెట్టడం మొదలెట్టినట్లు సమాచారం. ఆ టార్చర్ భరించలేకపోయిన మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చావుకు భర్త ప్రశాంత్, అతని కుటుంబసభ్యులే కారణం అని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






