రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: మాస్కోలో భారతీయ కార్మికుడు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 13:35:40  IST  )

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో ఓ భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: మాస్కోలో భారతీయ కార్మికుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. మాస్కో రీజియన్‌పై ఉక్రెయిన్ ఇవాళ భారీ ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర డ్రోన్ దాడిలో రష్యాలో పనిచేస్తున్న ఓ భారతీయ కార్మికుడు మృతిచెందగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) అధికారికంగా ధృవీకరించింది. ఘటన జరిగిన వెంటనే రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు రంగంలోకి దిగారు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతాన్ని వారు సందర్శించారు. గాయపడిన భారతీయ కార్మికులను మాస్కోలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అధికారులు అక్కడకు వెళ్లి వారిని పరామర్శించారు. ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడంపై భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేసింది. మృతి చెందిన కార్మికుడి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించేందుకు సదరు కంపెనీ యాజమాన్యంతో పాటు రష్యా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

Next Story