- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Udhampur: లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
అదుపుతప్పి బస్సు లయలో పడిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయిన ఘటన జమ్ముకాశ్మీర్ జిల్లాలోని ఉధంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని ఉధంపూర్ (Udhampur) జిల్లా రామ నగర్‌లో ఇవాళ ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే పలు అంబులెన్స్‌లను అక్కడికి పంపింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మితిమీరిన వేగామేనా లేక సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Next Story






