- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకుల అదృశ్యం..
వేరు వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులు అదృశ్యమైన సంఘటనలు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మేడిపల్లి : వేరు వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులు అదృశ్యమైన సంఘటనలు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విహారిక కాలనీలో నివసించే కడారి యాదగిరికి ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు కడారి నరేష్ (32) గత నెల డిసెంబర్ 11 బయటకు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదు. తండ్రి పిర్యాదుతో కేసునమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
ఇదే విధంగా బుద్దానగర్ లో నివసించే జోగిని శివకృష్ణ తన అన్న జోగిని సాయి కృష్ణ (24) తొ కలిసి నివసిస్తున్నాడు. సాయికృష్ణ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరకక డిప్రెషన్ లో ఉన్నాడు. గత నెల డిసెంబర్ 31 నాడు మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదని తమ్ముడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువత ధైర్యం కోల్పోవద్దని, డిప్రెషన్ కు లోను అయ్యి కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్లాలానే ఆలోచనలు మాని వారి మనసులను బాధించవద్దని సీఐ గోవింద రెడ్డి సూచించారు.






