- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ..బైకర్ ఢీ కొట్టడంతో ఎగిరిపడ్డ కానిస్టేబుల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనికీ చేపడుతున్న సమయంలో ఓ బైక్ రైడర్ వేగంగా వచ్చి కానిస్టేబుల్ ఆసిఫ్‌ను ఢీ కొట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనికీ చేపడుతున్న సమయంలో ఓ బైక్ రైడర్ వేగంగా వచ్చి కానిస్టేబుల్ ఆసిఫ్‌ను ఢీ కొట్టాడు. యువకుడు తప్పించుకునేందుకు బైక్ ఆపకుండా వేగంగా రావడంతో కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నంగా చేయగా ఢీ కొట్టడంతో ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
డ్యూటీలో ఉన్న పోలీసులు వెంటనే అతడిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆసిఫ్ కు మూడు చోట్ల బలమైన గాయాలు తగిలినట్టు సమాచారం. మరోవైపు ఢీ కొట్టిన వ్యక్తిని విశాల్ గా గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బైక్ రైడర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చలాన్ తో పోయేదని, ఇప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రాణాల మీదకు తెచ్చిందని మండిపడుతున్నారు. video






